కవుతరం చరిత్ర లో కొన్ని ముఖ్య తేదీలు
క్రీ.పూ. 1000 శ్రీ గౌతమేశ్వరస్వామి ప్రతిష్టాపన?
క్రీ.శ. 1 – 100 కంబోడియా లో కవుతరం యేర్పడింది.
క్రీ.శ. 250 – 650 శ్రీ గౌతమేశ్వరస్వామి పునద్దర్శనం?
క్రీ.శ. 1022 – 1061 రాజరాజ నరేంద్రునిచే చెన్నకేశవ స్వామి ప్రతిష్టాపన?
క్రీ.శ. 1149 సోమన్న మంత్రి శిలాశాసనములోని “గౌతరం”
క్రీ.శ. 1328 – 1427 రెడ్డిరాజులచే శ్రీ గౌతమేశ్వర, చెన్నకేశవస్వామి వార్ల దేవాలయముల పునరుద్ధరణ.
క్రీ.త. వడ్డి చెరువు నిర్మాణం.
” 1499 రెడ్డిప్రముఖునిచే పై స్వాములకు మన్యములు దానం చేయబడ్డాయి.
” 1685 తాళ్లూరి వారి ప్రవేశం
” 1710 కానూరి వారు, పెదబోబ్బావారు, వడ్లమూడి వారు ప్రవేశం
” 1735 పశుభొట్లపాలెం లో చిట్టిబొమ్మ వారి ప్రవేశం
” 1759 కామదనవారికి నైజంచే జమిందారీ సన్నదులు ఇవ్వబడ్డాయి.
” 1759 మర్చి 3 వ తేదీన కెప్టెన్ మెక్లిన్ (ఇంగ్లీష్ వారు) కానుకొల్లుకోటను పట్టుకొన్నారు.
” 1759 గుడివాడ, ఆకులుమన్నాడు ఫిర్కాలు ఫ్రెంచివారి జెండా క్రింద నుండి ఇంగ్లీష్ జెండా క్రిందకు వచ్చాయి.
” 1760 కమదనవారు శ్రీ గౌతమేశ్వర, చెన్నకేశవస్వామి వార్లకు భూదాన ధర్మశాసన పత్రములు యిచ్చుట.
” 1760 పై స్వాములకు కాపులు, కరణాలు చెకునామాలు వ్రాయించి యిచ్చినారు.
” 1760 తాళ్లూరి వెంకటనారాయణ చెరువు, తాళ్లూరివారి తోట
” 1760 తూము వారితోట
” 1764 కానూరి వారితోట, చెరువులు
” 1764 బోబ్బావారితోట, చెరువు
” 1784 అల్లాడవారితోట, చెరువు
” 1794 నుయినంవారితోట
” 1794 ఈడేవారితోట
” 1798 – 1801 చారుమహల్ సంస్థానంలో తాళ్లూరి జోగయ్యగారి దివాన్ గిరి
” 1800 చినబొబ్బావారు, గుళ్ళపల్లి వారు ప్రవేశం
” 1803 శాశ్వత ఫైసలయితీ (Permanent settlement)
” 1803 కానూరి శీనయ్యగారి పొలిమేర్లు త్రొక్కుట
” 1819 శిథిలావస్థలోనున్న దేవాలయముల పునరుద్ధరణ
” 1828 బోళ్ళపాటివారి తోట
” 1828 ఆఖరి సహగమనం (కానూరి వారిలో)
” 1833 – 34 నందననామ కరువు
” ” పరగణా పెత్తందారు వడ్లమూడి సుబ్బన్నగారి ధీరోదాత్తత
” 1836 వడ్లమూడి జానకీరాముడు చెరువు
” 1841 జులై 23 తేదీన వడ్ఢచెరువు నీటి వనరుల మీద వచ్చిన తగువులో జమిందార్ యిచ్చిన ఉత్తర సాక్షం
” 1843 నవంబరు 20వ తేదీతో గురజ జమీందారీ పరిపాలన అంతం.
” 1850 నడివీథిలో రామాలయం స్థాపన?
” 1855 కృష్ణ ఆనకట్ట పూర్తిఅయింది
” 1860 కవుతరం లాకు, కవుతరం సబ్ డివిజన్
” 1880 కొల్లి అచ్చన్నగారి సత్రం స్థాపన
” 1881 బందరు – తిరువూరు రోడ్ రూపొందింది
” 1882 బాలుర ప్రాథమిక పాఠశాల స్థాపన
” 1890 ఇన్స్పెక్షన్ బంగాళా (P.W.D) నిర్మాణం
” 1890 గురజ నుండి యిక్కడికి పోలీస్ స్టేషన్ వచ్చింది
” 1894 పోస్టాఫీస్ స్థాపన
” 1895 నీటితీరువా సమ్మె – కానూరి చలమయ్యగారి నాయకత్వం
” 1899 నాగేశ్వరావుపేట (కొత్తపేట) ఏర్పడంది
” 1903 గాలిగోపుర నిర్మాణం
” 1904 – 1910 వందేమాతర ఉద్యమం
” 1906 స్కాట్ పేట స్థాపన
” 1906 బాలికా పాఠశాల స్థాపన
” 1906 గౌడకులస్థుల నిర్బంధాచార వ్యతిరేక పోరాటం
” 1907 బెజవాడ – బందర్ రైల్వేలైను పూర్తిఅయింది.
” 1907 ఆంధ్రలక్ష్మి ఇండస్ట్రియల్ కంపెనీ లిమిటెడ్ స్థాపన
” 1907 బిపిన్ చంద్రపాల్ బందరు మహాసభ.
” 1908 సహకార పరపతి సంఘం స్థాపన
” 1908 ఎస్.డి.ఓ. బంగళా, సబ్ డివిజన్ ఆఫీస్ (P.W.D) నిర్మాణం
” 1909 సబ్ రిజిష్టార్ ఆఫీస్ స్థాపన
” 1907 – 12 కట్టమంచి కొళ్ళందరెడ్డిగారు వున్నకాలం
” 1910 – 1919 చెరుకువాడ వెంకటనరసింహం పంతులుగారు వున్నకాలం
” 1910 ఆంధ్రరాష్ట్ర ప్రథమ కమ్మ మహాసభ
” 1911 ఆంధ్రలక్ష్మి ఇండస్ట్రియల్ కంపెనీ ఆవరణలో జాతీయ విద్యాలయం
” 1917 పంచాయితీ బోర్డుకు ప్రాతిపదిక యేర్పడింది
” 1918 ఎన్నికైన ప్రథమ పంచాయితీ బోర్డు
” 1918 దేవాలయములకు కోర్టు స్కీములు ప్రవేశపెట్టబడినాయి
” 1920 వెంకటనారాయణ సత్రం నిర్మాణం
” 1924 లేబర్ స్కూల్ స్థాపన
” 1925 జిల్లాబోర్డు మెడికల్ డిస్పెన్సరీ యేర్పాటు
” 1926 సబ్ రిజిష్టార్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణం
” 1926 అమ్మవారి పురమందిరం
” 1927 కవుతరం ఫిర్కా పోయి గుడ్లవల్లేరు ఫిర్కా అయింది
” 1927 ఉప్పలపాటి చెరువు పునరుద్దరణ
” 1927 కవుతరం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఆఫీస్ పామర్రు కు వెళ్ళింది
” 1929 శ్రీరామలింగేశ్వర దేవాలయ నిర్మాణం (కొత్తపేట)
” 1929 వల్లూరి సూర్యనారాయణరావుగారి ప్రచార వసతి గృహం, గాంధీగారి రాక
” 1930 బందరు నల్లజెండా కేసులు
” 1930 జిల్లా మెడికల్ డిస్పెన్సరీ గుడ్లవల్లేరు కు పోయింది
” 1930 గుడ్లవల్లేరు ఆఫీస్ – సబ్ ఆఫీస్ అయింది. కవుతరం ఆఫీస్ – ఎక్స్ ట్రా డిపార్ట్మెంటల్ ఆఫీస్ (Postal) గా దిగజారింది
” 1930 – 31 ఉప్పుసత్యాగ్రహం – జైలుశిక్షలు
” 1932 గ్రామ సేవాసమితి
” 1939 కవుతరం గేటు రైల్వే స్టేషన్ స్థాపన
” 1939 వాలంటీర్ల శిక్షణా శిబిరం
” 1940 వ్యక్తి సత్యాగ్రహం – అరెస్టులు
” 1942 ఆగష్టు ఉద్యమం – అరెస్టులు
” 1943 గుడివాడ తాలూకా ప్రథమ కమ్యూనిస్టు మహా సభ
” 1947 స్వాతంత్రయం వచ్చింది
” 1950 జిల్లా బోర్డు మాధ్యమిక పాఠశాల స్థాపన
” 1951 హైస్కూల్ తరగతులు ప్రారంభం
” 1953 శ్రీ కానూరి దామోదరయ్య బోర్డు హైస్కూల్ భవన నిర్మాణం
” 1956 జనవరి 8 తేదీన వాంగ్మయ మహాధ్యక్ష వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారికి అఖండ సన్మానము, కనకాభిషేకం
” 1956 కవుతరం సబ్ ఆఫీస్ (పోస్టల్) స్థాపన
” 1957 బ్రాంచి లైబ్రరీ స్థాపన (జిల్లా లైబ్రరీ ఆథారిటి వారిచే)
” 1958 వీథులలో విద్యుద్దీపాలు వెలిగాయి
” 1963 పశుగణాభివృద్ధి ఉపకేంద్రం
” 1963 శ్రీ రాధాకృష్ణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం రిజిస్ట్రేషన్
” 1964 కవుతరం రైల్వేస్టేషన్ నూత్న భవనములు.
” 1967 ఈ సంఘం పాల సేకరణ ప్రారంభం
” 1967 శ్రీమతి కాజ దుర్గమ్మ స్మారక పశుగణాభివృద్ధి కేంద్ర భవనం.
” 1967 విశాలపరపతి సహకార సంఘం, రైసుమిల్లు.
” 1971 ఆంధ్రాబ్యాంకు (సెప్టెంబర్ 1).
” 1974 ఆర్.టి.సి. బస్ ప్రయాణికుల షెల్టర్
” 1976 గ్రామ పంచాయతీ భవనం
” 1979 శ్రీ రాధాకృష్ణ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం భవనం
” 1982 33/11 k.v విద్యుచ్ఛక్తి సబ్ స్టేషన్
” 1986 కవుతరం లిమిట్స్ లో “గుడ్లవల్లేరు మండల పోలీస్ స్టేషన్” భవనం
” 1991 కీ.శే. తాళ్లూరి వెంకటనారాయణ స్మారక శాఖా గ్రంధాలయ భవనం
” 1994 రక్షిత మంచినీటి పథకం శంకుస్థాపన.