గౌతమేశ్వర వరప్రసాదితమని చెప్పబడుతున్న యీ కౌతరం గ్రామం భూమధ్య రేఖకు ఉత్తరంగా 16.20 డిగ్రీల అక్షాoశ రేఖ మీదను,
గ్రీన్విచ్ కి తూర్పుగా 81.07 డిగ్రీల రేఖాంశము మీదనుగలదు. కృష్ణాజిల్లా కేంద్ర స్థానమైన మచిలీపట్టణము (బందరు)నకు వాయువ్య దిక్కుగా 11 మైళ్ళు, గుడివాడ తాలూకా కేంద్ర స్థానమైన గుడివాడ పట్టణమునకు ఆగ్నేయ దిక్కుగా 8 1/2 మైళ్ళ దూరమందు వున్నది.

బందరు – తిరువూరు మెటల్ రోడ్డు యీ గ్రామం మధ్యగా పోయింది. అంతేకాక యీ గ్రామం బెజవాడ – బందరు రైల్వే లైను మీద వున్నది. దీనికి “కవుతరం”, “కవుతరంగేటు” అను రెండు రైల్వే స్టేషన్లు వుండేవి. రెంటికి బదులు గ్రామానికి సమీపంలో 1964 లో నూత్న భవనాలతో ఒకే ఒక స్టేషన్ ఏర్పడింది. నలుదిక్కుల పోయిన, పడవలు నడిచే కాలువల కూడలిస్థానం దీని పొలిమేరలో వుంది. దాన్ని “కవుతరం లాకులు” అందురు.

బస్ స్టాండ్

రైల్వే స్టేషన్ చరిత్ర